హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్‌కు (ఐడీఈఎస్)కు చెందిన బీ అజిత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఐదేండ్లకు ఆయన డిప్యూటేషన్‌పై సీఎం రేవంత్ వద్ద విధులు నిర్వర్తిస్తారు. అతను పేరెంట్ క్యాడర్లోనే వేతనాలు పొందనున్నారు. ఎస్ఎస్బీ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అజిత్‌రెడ్డి పనిచేసినట్టు సమాచారం.