CM Revanth Reddy | నాడు అట్ల.. నేడు ఇట్ల.. నీతి ఆయోగ్ బహిష్కరణపై రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం!
అనుభవంలోకి వస్తే తప్ప జ్ఞానం బోధపడదని అంటే ఇదేనేమో. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తే పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు.
- అప్పట్లో నీతి ఆయోగ్ సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరిస్తే టీపీసీసీ అధ్యక్ష హోదాలో తప్పుపట్టిన రేవంత్‌రెడ్డి
- ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్నోట బహిష్కరణ మాట
- 27న నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లేది లేదని సభలో ప్రకటన
- నాడు కేసీఆర్ నడిచిన బాటలో నేడు రేవంత్
అప్పుడు అలా..!
నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ వెళ్లకపోవడం తప్పు!
నీతి ఆయోగ్ మీటింగ్‌కు సీఎం కేసీఆర్ హాజరుకావాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని ప్రశ్నించేందుకు ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానంటే మేమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తం. ఈ మీటింగ్‌కు కేసీఆర్ హాజరుకాకుంటే ప్రధాని మోదీకి లొంగిపోయినట్టే!
-టీపీసీసీ అధ్యక్ష హోదాలో 2022, ఆగస్టు 7న రేవంత్‌రెడ్డి
ఇప్పుడు ఇలా..!
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నం
ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నం. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది. నిధుల కేటాయింపుల్లో రాష్ర్టానికి అన్యాయం చేసింది.
-2024, జూలై 24న సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి
కేంద్రం వైఖరికి నిరసనగా నీతి ఆయోగ్ బహిష్కరణ
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను కేంద్రం పట్టించుకోనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నం.
-2022, ఆగస్టు 6న సీఎం కేసీఆర్
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : అనుభవంలోకి వస్తే తప్ప జ్ఞానం బోధపడదని అంటే ఇదేనేమో. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తే పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని నిలదీయడానికి నీతి అయోగ్ సమావేశం ఒక మంచి అవకాశమని వాదించారు. ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ వెళ్లాలని డిమాండ్ చేశారు. అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు బుధవారం శాసనసభలో ప్రకటించారు. అంటే అప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కరక్టే అని ఇప్పటికైనా ఒప్పుకున్న ట్టే కదా? తెలంగాణపై కేంద్రంలో బీజేపీ సర్కార్ వివక్షను కేసీఆర్ ఎందుకు ఎండగట్టాల్సి వచ్చిందో ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? కేంద్రం వైఖరిపై అప్పుడు కేసీఆర్ ధర్మాగ్రహంలో న్యాయం ఉందని ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి అంగీకరించినట్టేనా?
కేసీఆర్ అప్పుడు ఎందుకు బహిష్కరించారు
నీతి అయోగ్ సిఫారసులకు కేంద్రం విలువ ఇవ్వనప్పుడు ఆ సమావేశానికి వెళ్లడంలో అర్థం లేదనే బహిష్కరిస్తున్నట్టు రెండేండ్ల కిందట సీఎం కేసీఆర్ (ఆగస్టు 7, 2022)ప్రకటించారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్ తెలంగాణకు ఇవ్వాలని నీతి అయోగ్ చేసిన సిఫారసును కేంద్రం పట్టించుకోకపోవడంతో.. నిరసనగా నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్ వివరించారు. కేంద్రం వైఖరిని తప్పుపట్టాల్సిందిపోయి అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్ నిర్ణయాన్నే తప్పుపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM Revanth Reddy
- KCR
- NITI Aayog
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

