సుదర్శన్ పార్థివదేహం తరలింపునకు సీఎం సహాయనిధి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అవిలాల సుదర్శన్ పార్థివదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది.
- రూ. 6 లక్షలు మంజూరు చేస్తూ సీఎం ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అవిలాల సుదర్శన్ పార్థివదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. మృతుడి అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకురావడానికి రూ.6లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు సోమవారం జారీ చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 1న సుదర్శన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందగా, ఆయన భార్య అవిలాల భార్గవి ఈనెల 9నన జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సాయం చేయాలని వేడుకున్నది. భార్గవి విజ్ఞప్తిని, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ ద్వారా సిఫారసు చేశారు. మంత్రి విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి, భార్గవికి రూ. 6.00 లక్షలు సీఎం సహాయనిధి నుంచి కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

