రూ.60 కోట్ల మోసం.. దంపతుల అరెస్టు
బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేట్ ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో దంపతులను 11 ఏండ్ల తర్వాత సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మణికొండ ఆంజనేయులు, అతడి భార్య రీటా 2013లో బాలానగర్ ఎస్బీఐ నుంచి రూ.27 కోట్ల రుణాన్ని తీసుకుని పరారయ్యారు.
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : బ్యాంకు, ఫైనాన్స్, ప్రైవేట్ ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో దంపతులను 11 ఏండ్ల తర్వాత సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మణికొండ ఆంజనేయులు, అతడి భార్య రీటా 2013లో బాలానగర్ ఎస్బీఐ నుంచి రూ.27 కోట్ల రుణాన్ని తీసుకుని పరారయ్యారు.
బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేసును సీఐడీకి బదిలీ చేశారు. వారి విచారణలో ఆంజనేయులు దంపతులపై హైదరాబాద్ సిటీలో 4 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఓ కేసులో ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్ ఇన్వెస్టర్లను రూ.60 కోట్లకు మోసం చేసినట్లు తేలింది. 2013 నుంచి వీరు పరారీలో ఉండగా.. సీఐడీ డీజీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆంజనేయులు దంపతులను బెంగళూరులో అరెస్టు చేసి, కూకట్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

