హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, శిశు సంరక్షణ కేంద్రాల్లో సోమవారం బాలల హక్కులను తెలియజేయాలని, తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయించాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీఎస్సీపీసీఆర్) శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
పిల్లల హక్కులను కాపాడే చట్టాలు, వారి పట్ల బాధ్యతగా ఉండాల్సిన పద్ధతులను వివరించాలని, ఈ బాధ్యతను విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, అన్ని జిల్లాల కలెక్టర్లు తీసుకోవాలని సూచించింది. తెలంగాణ బాలల హకుల పరిరక్షణ కమిషన్ అనేది సీపీసీఆర్ యాక్ట్-2005 ద్వారా చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ. బాలల హకుల కోసం నిర్దేశించిన పోక్సో, జేజే, ఆర్టీఈ వంటి చట్టాల అమలును ఈ కమిషన్ రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తుంది.