దుబాయ్, అక్టోబర్ 6: తెలంగాణ స్వరాష్ట్రంలోనే కాదు.. విదేశాల్లోనూ గంగా జమున తెహజీబ్‌ను చాటగలం అని నిరూపించాడు మన తెలంగాణ బిడ్డ. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఖుర్షీద్ అహ్మద్ (46) దుబాయ్‌లో పనిచేస్తున్నారు. మక్కా సందర్శనకు వెళ్లి పాస్‌పోర్టు, సెల్‌ఫోన్ సహా అన్ని వస్తువులను పోగొట్టుకున్నారు. ఎవరూ సాయం అందించలేదు. ఈ విషయం తెలిసిన తెలంగాణ వాసి కొండాడం కృష్ణ.. మక్కా నుంచి జెద్దాకు రప్పించి, ఖుర్షీద్‌కు ఆహారం షెల్టర్ అందించారు. భారత రాయబార కార్యాలయానికి చేర్చి, భారత్‌కు చేరేలా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇప్పించారు. విమాన ఖర్చులకు కూడా సాయం చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన కృష్ణ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘అల్లాను దర్శించుకొనేందుకు వచ్చిన ఖుర్షీద్‌కు సాయం చేస్తే, నా దేవుడు నాకు అంతకుమించిన బహుమతి ఇస్తాడు’ అని చెప్పారు.