చేర్యాల, అక్టోబర్ 27: ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రశంసించారు. చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో నకాశీ చిత్రకళ ఓ జానపద కళగా ప్రాచూర్యాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ బొమ్మలను గీసే ప్రక్రియ ప్రత్యేకమైనదని కొనియాడారు. నకాశీ చిత్రకళను ప్రధాని ప్రశంసించడంతో చేర్యాల వాసు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.