కేంద్రం ఇస్తేనే కరువు సాయం
కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా, ఆ నీళ్లను ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రాష్ట్రంలో కరువుకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులను నిండా ముంచేందుకే సిద్ధమైంది.
- రేవంత్ సర్కార్ హ్యాండ్సప్.. రైతన్నకు మరో మొండిచెయ్యి
- రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడినుంచి తెచ్చిస్తది?
- కరువు పరిహారంపై చేతులెత్తేసిన క్యాబినెట్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుసుడు కష్టమే!
- నిరుద్యోగులు మనపై ఆగ్రహంతో ఉన్నరు
- కొత్త నోటిఫికేషన్లు ప్రకటించి, ఊరిద్దాం
- డిసెంబర్లో మేడిగడ్డకు మరమ్మతులు
- కాళేశ్వరంపై చర్చకు ప్రత్యేకంగా అసెంబ్లీ
- క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా, ఆ నీళ్లను ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రాష్ట్రంలో కరువుకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులను నిండా ముంచేందుకే సిద్ధమైంది. ఇప్పటికే సాగునీళ్ల విషయంలో ధోకా చేయగా, ఇప్పుడు కరువుసాయంలోనూ వంచించేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది. గురువారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతులకు కరువుసాయం భారాన్ని కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రం నిధులు ఇస్తేనే అన్నదాతలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రప్రభుత్వం సొంతంగా నయా పైసా సాయం చేసే పరిస్థితిలో లేదని తేల్చినట్టు తెలిసింది.
ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, పైగా కరువు పరిస్థితులతో ఆదాయం మరింత తగ్గుతున్నదని పేర్కొన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కరువుసాయాన్ని రాష్ట్రప్రభుత్వం సొంతంగా భరించే పరిస్థితి లేదని తేల్చారని సమాచారం. కేంద్రం ఇచ్చే నిధులపై ఆధారపడటం తప్ప మనం చేసేదేమీ లేదని క్యాబినెట్లో నిస్సహాయతను వ్యక్తంచేసినట్టు తెలిసింది. కేంద్రం నుంచి నిధులు వచ్చేవరకు రైతులకు కరువు సాయం పంపిణీపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులను ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. ఏమాత్రం అతి చేసినా రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారట.
20 లక్షల ఎకరాలు.. 25వేల కోట్ల నష్టం
ఎల్ నినో ప్రభావం, కరువు నివారణ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తన తొలి నివేదికను ఇదే క్యాబినెట్ సమావేశంలో సమర్పించినట్టు తెలిసింది. అఖిలపక్ష సమావేశం, ఉన్నతాధికారులు, వివిధ రంగాల నిపుణులతో చర్చించి సబ్ కమిటీ రూపొందించిన సిఫార్సులను మంత్రివర్గం పరిశీలించినట్టు సమాచారం. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అంచనా వేశారట. ఇందులో అత్యధికంగా వరి, పత్తి నష్టపోయినట్టు వెల్లడించింది. పంటనష్టం విలువ రూ.25వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రైతులకు కరువు సాయం ఇవ్వడంపైనా చర్చించినట్టు తెలిసింది.
ఇందులో భాగంగానే కేంద్రప్రభుత్వం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాబట్టేందుకు సమగ్ర నివేదికను సిద్ధంచేసి ఢిల్లీకి పంపించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందిగా మారిన గ్రామాల్లో సాగు, తాగునీరు, నిరంతర విద్యుత్తు సరఫరా, తీవ్రమవుతున్న పశుగ్రాసం కొరత వంటి సమస్యలను పరిష్కరించలేమని, పంట నష్టపరిహారం చెల్లింపుల మీద స్పష్టత ఇవ్వలేమని మంత్రివర్గంలో చర్చకొచ్చినట్టు తెలిసింది.
ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్కే ప్రాధాన్యం
కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ సర్కార్ విధానాల వల్ల తలెత్తిన కరువే ఎకువన్న తీవ్ర అసంతృప్తి క్షేత్రస్థాయిలో వ్యక్తం అవుతున్నది. ఇలాంటి సమయంలో గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కరువు నివారణకు సమగ్ర కార్యాచరణ, వ్యూహరచన చేస్తారని అంతా భావించారు. కానీ మంత్రుల ప్రాధాన్యాలు మాత్రం వేరేగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది.

ప్రజల ఇబ్బందులు, కరువు సమస్యలను పకనబెట్టి, ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ ఏర్పాట్లు, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ వ్యూహాలు పన్నడానికే సరార్ పెద్దలు అధిక సమయాన్ని కేటాయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధికారిక ఎజెండా ప్రారంభం కావడానికి ముందు జరిగిన అనధికార భేటీలో త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీ గురించి మంత్రులతో సీఎం చర్చించినట్టు సమాచారం.
భూముల అమ్మకం, ఆదాయంపైనా నిర్ణయం!
ఆదాయం కోసం మరోసారి భూములు విక్రయించాలని క్యాబినెట్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ మేరకు వివిధ శాఖల పరిధిలోని భూములను టీజీఐఐసీకి బదిలీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు భూ పరిపాలనకు సంబంధించిన వివాదాస్పద చట్టం 22ఏ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగిందని తెలిసింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని భూములు, నోటరీ, సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక యోచన చేసినట్టు తెలిసింది.
ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఆక్రమణల్లో ఉన్న వెయ్యి గజాల లోపు భూములను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రజల నుంచి మళ్లీ కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించే అవకాశాలపై మంత్రివర్గం సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అంచనా వేసినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సంసరణల చట్టాలను రాష్ట్రంలోనూ పూర్తిస్థాయిలో అమలు పరచాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పాలనాపరంగా అత్యవసరమైన కొన్ని కీలక శాఖల్లో కొత్త పోస్టులను మంజూరు చేసేందుకు కూడా మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించిందని సమాచారం.
యువ ఓటర్లకు ఉద్యోగాల గాలం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నిరుద్యోగులకు గాలం వేయాలని, ఈ మేరకు పోస్టుల భర్తీపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ చర్చలో పలువురు మంత్రులు గ్రాడ్యుయేట్ ఓటర్ల మనోభావాలపై తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు బీఆర్ఎస్కు అనుకూల ఓటుబ్యాంకుగా మారిందని మంత్రులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి తప్పదని కొందరు మంత్రులు హెచ్చరించినట్టు సమాచారం.
పట్టభద్రుల నియోజకవర్గాల్లో నిరుద్యోగ సమస్యే ప్రధాన ప్రచారాంశంగా మారే అవకాశం ఉన్నదని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే యువతలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం తప్ప గత్యంతరం లేదని మంత్రులు సూచించినట్టు తెలిసింది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాల ప్రక్రియను తెరపైకి తేవాలనే ఆలోచన ఈ భేటీలో ముందుకొచ్చినట్టు తెలిసింది. నోటిఫికేషన్లతో నిరుద్యోగులను ఊరించడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. యువతలో తిరిగి ఆశలు రేకెత్తించి, సరార్పై నమ్మకం కుదిరేలా చేయడానికి తక్షణమే వివిధ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీల వివరాలను సేకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతున్నదనే ప్రచారాన్ని విస్తృతంగా నిరుద్యోగుల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

