నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని తమిళనాడు తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో 23 నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. తర్వాత ఇది వాయవ్య దిశగా కదిలి తదుపరి 3 రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని తమిళనాడు తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో 23 నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. తర్వాత ఇది వాయవ్య దిశగా కదిలి తదుపరి 3 రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో అకడకడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

