Telangana BJP | రైతు రుణ మాఫీ, కౌలు రైతుల సమస్యలతోపాటు పసల్ బీమా, పంటలకు బోనస్ తదితర హామీల అమలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాల యాపన చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో హామీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యంపై చర్చించామని చెప్పారు. బుధవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.
రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పక్షంలో వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ వేదికగానే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై 12న జరిగే పార్టీ సమావేశంలో ఆందోళనా కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు.
Vivo | వివో నుంచి మరో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
New EV Policy | కొత్త ఈవీ పాలసీ’లో మార్పులు.. దేశీయ కంపెనీలకే బెనిఫిట్లు.. ఎందుకంటే..?!
Tomato | మండే బ్లూస్ మాదిరిగా టమాటా కష్టాలు.. సెంచరీకి చేరువలో కిలో..!