Ben Stokes : అంతర్జాతీయ క్రికెట్లో బెన్ స్టోక్స్(Ben Stokes) శకం ముగిసింది. కళ తప్పుతున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు వన్నె తెచ్చిన స్టోక్స్ ఓటమితో ఆటకు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టీ20ల్లో.. టెస్టుల్లో కెప్టెన్‌గా ఇంగ్లండ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన స్టోక్స్ చివరి మ్యాచ్‌లో అద్భుతం చేయలేకపోయాడు. నాటింగ్హమ్ టెస్టులో 160 పరుగుల పరాజయంతో బజ్‌బాల్ ఆటకు, స్టోక్స్ ప్రస్థానానికి తెరపడింది. సారథిగా తొలి సిరీస్‌లోనే న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసిన అతడు.. ఇప్పుడు ఆ జట్టు చేతిలోనే సిరీస్ ఓడిన బాధతో మైదానం వీడాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు ప్రాణమిచ్చే ఈ పోటుగాడి మరపురాని ఇన్నింగ్స్‌లు మరోసారి గుర్తు చేసుకుంది.
ఇంగ్లండ్ క్రికెట్‌ను ‘బెన్ స్టోక్స్‌కు ముందు.. స్టోక్స్ తర్వాత’ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. సంప్రదాయ క్రికెట్‌నే నమ్ముకున్న జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్లలో స్టోక్స్ పేరు ముందు వరసులో ఉంటుంది. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే.. వికెట్లు పడుతున్నా సరే.. దంచుడే పరమావధిగా ఆడడం అతడి నైజం. 2022లో జో రూట్ వారసుడిగా టెస్టు పగ్గాలు అందుకున్న స్టోక్స్.. బజ్‌బాల్ ఆటను పరిచయం చేశాడు. బ్రెండన్ మెక్కల్లమ్ హెడ్‌కోచ్‌గా, దూకుడే మంత్రగా ఆడే స్టోక్స్ సారథ్యంలో.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ వన్డే తరహాలో ఆడడం అలవర్చుకుంది ఇంగ్లండ్.
One of England’s all-time greatest captains, Ben Stokes, has decided to retire from international cricket at the end of this Test match.
Ben, you have been the most inspirational captain, leader and legend this team could have ever hoped for.
We love you so much and wish you… pic.twitter.com/U5grq0F0kj
— England Cricket (@englandcricket) June 28, 2026
ఓటమిని అంగీకరించని మనస్తత్వం, సానుకూల దృక్ఫథం ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆలోచనన తీరును మార్చేశాయి. ఓడిపోతామనే భయం లేకుండా ఆడడం నేర్పిన స్టోక్స్.. టెయిలెండర్లలో స్ఫూర్తి రగిలించి సంచలన విజయాలకు ఆద్యుడయ్యాడు. అంతేకాదు.. నాయకుడిగా ముందుడి జట్టుని నడపించడం అతడి ప్రత్యేకతల్లో ఒకటి. ఒత్తిడిలోనూ రాణించడం, వికెట్ అవసరమైన ప్రతిసారి బంతి అందుకోవడం వంటివి అతడిని గొప్ప సారథిగా మలిచాయి. కానీ, అనూహ్యంగా అదే బజ్ బాల్ వ్యూహం ఆ జట్టును దెబ్బతీసింది. కెప్టెన్‌గా చెరగని ముద్ర వేసిన స్టోక్స్.. జూన్ 29 సోమవారంతో అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేశాడు. మూడు ఫార్మాట్లలో విధ్వంసక ఆటతో అలరించిన అతడు ఎక్కువగా ప్రేమించింది, ప్రాణంగా భావించింది మాత్రం టెస్టులనే.
Our match-winner.
Our leader.
Our Superman.
Ben Stokes, you are a once-in-a-generation cricketer 👑 pic.twitter.com/0xXZf4RigL
— England Cricket (@englandcricket) June 29, 2026
టెస్టుల కోసం వన్డేలకు వీడ్కోలు పలికిన ఈ ఆల్‌రౌండర్, ఈసీబీ, జోస్ బట్లర్ కోరిక మేరకు 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. కానీ, మోకాలి గాయంతో.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న స్టోక్స్ మళ్లీ మైదానంలోకి దిగాడు. అయితే.. భారత పర్యటనలో.. ఆపై యాషెస్ సిరీస్‌లోనూ స్టోక్స్ సేన కుదేలైంది. బజ్బల్పై వ్యతిరేకత, అతడి కెప్టెన్సీపై అనుమానాలు మొదలయ్యాయి. స్వదేశంలో న్యూజిలాండ్ దెబ్బకు ఓవల్ టెస్టులో 253 రన్స్ తేడాతో ఓడడం స్టోక్స్‌ను రిటైర్మెంట్ ప్రకటించేందుకు దారి తీసిందని చెప్పాలి.
యాషెస్ టెస్టు(2019)లో 359 పరుగుల ఛేదనలో ఓటమి అంచున నిలిచిన ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ఘనడు. చివరి బ్యాటర్ జాక్ లీచ్‌తో 76 రన్స్ జోడించిన స్టోక్స్ (135 నాటౌట్) చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
Ben Stokes, you were extraordinary 🏴 pic.twitter.com/7obRBF8RFV
— Cricinfo (@cricinfo) June 29, 2026
అదే ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్‌కు మొట్టమొదటి వరల్డ్‌కప్‌ను ముద్దాడడంలో కీలకయమ్యాడు. మొత్తంగా 122 టెస్టుల్లో.. 7273 పరుగులు సాధించాడు. 14 శతకాలు, 37 అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక స్కోర్ 258(దక్షిణాఫ్రికాపై 2016లో). బంతితోనూ మెరిసిన స్టోక్స్ 252 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 6-22.