పెన్పహాడ్, జూన్ 29 : పెన్పహాడ్ మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ గోపికృష్ణ ఆదేశానుసారం పోలీసులు సోమవారం గ్రామంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాటు సారా తయారు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామాల పరిధిలో చట్టవిరుద్ధ పనులు జరుగుతుంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు.