Lions Club | లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఠాకూర్ ఉమ్రావ్ సింగ్
Lions Club | ఏకగ్రీవంగా ఎనికైన తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది.
తాండూర్ : ఏకగ్రీవంగా ఎనికైన తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ ( Tandur Lions Club ) నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ లయన్ రిక్కల నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఠాకూర్ ఉమ్రావ్ సింగ్ ( Umrao Singh ) , కార్యదర్శిగా తాటిపాముల సాంబమూర్తి, కోశాధికారిగా గందె రాజన్న, ఉపాధ్యక్షుడిగా మద్దికుంట రామచందర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ తాండూర్ తెలంగాణ క్లబ్ గత 11 సంవత్సరాలుగా ఉచిత కంటి పరీక్ష, రక్తదాన, మధుమేహ పరీక్ష శిబిరాలను నిర్వహించడమే కాకుండా దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేస్తూ అపన్నులకు నిర్విరామంగా సేవలందిస్తుందని కొనియాడారు. నూతన అధ్యక్షుడు ఉమ్రావ్ సింగ్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేపడతామని అవసరార్థులకు అన్ని విధాల సేవలందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజియన్ కోఆర్డినేటర్ దుద్దిల్ల నారాయణరావు, రీజియన్ చైర్పర్సన్ బొమ్మ బాపురెడ్డి, జోనల్ చైర్పర్సన్ అన్నం రమేష్, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు దేవరకొండ రాజయ్య, బాలప్రసాద్ మారు, మాజీ జోనల్ చైర్ పర్సన్ రౌతు వెంకటేషం, తాండూర్ తెలంగాణ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

