కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం 85వ వర్ధంతిని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ కాంతిలాల్ సుభాష్‌పాటిల్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నివాళులర్పించారు.
జోడేఘాట్‌లో పదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పాలక వర్గం పేర్లతో ఏర్పాటు చేసిన నేమ్ ప్లేట్లను మూసి వేస్తూ అధికారులు కట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా భీం విగ్రహం కింద ఏర్పాటు చేసిన పేర్లను తొలగించామని సంబంధిత అధికారులు తెలిపారు.