Osmania University | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ టెక్నాలజీ హాస్టల్ విద్యార్థులు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ వీసీ మాకొద్దంటూ నినదించారు.
ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తమ ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓయూ టెక్నాలజీ హాస్టల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. హాస్టల్ బాత్రూం పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయని గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆందోళన చేశారు. బాత్ రూంలకు వెళ్లాలంటేనే భయమేస్తుంది.. వెంటనే అధికారులు హాస్టల్ మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల రాస్తారోకో నేపథ్యంలో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూకు వెళ్లే రహదారులను పోలీసులు బంద్ చేశారు. ఎండల్లో మేము.. ఏసీల్లో మీరా అంటూ ఓయూ అధికారులను ఉద్దేశించి విద్యార్థులు నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి విద్యార్థికి గాయాలు
ఓయూలో విద్యార్థుల రాస్తారోకో.. తమకు భద్రత కల్పించాలని డిమాండ్
ఓయూకు వెళ్లే రహదారులను బంద్ చేసిన పోలీసులు
గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆందోళన
బాత్ రూంలకు వెళ్లాలంటేనే… pic.twitter.com/yoB5S6rIPV
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025