హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని గురుకుల సొసైటీల నిర్వహణ కోసం కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నైట్‌డ్యూటీల నుంచి గురుకుల టీచర్లను మినహాయించాలని, వార్డెన్లను నియమించాలని కోరారు. తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ టీఎన్జీవోస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ విజినరీ గురుకుల అల్యూమినీ జాయింట్ సెక్రటరీ వివేకానంద మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం మంచి పరిణామని పేర్కొన్నారు. అనంతరం వివిధ సొసైటీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రిన్సిపాల్స్‌కు మెమెంటోలు అందజేసి సతరించారు.