హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పేపర్లవారీగా టెట్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం విడుదల చేశారు. 2025 జనవరి 2 నుంచి 20 వరకు 20 సెషన్లల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 9 నుంచి 11:30 గం టల వరకు సెషన్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వర కు సెషన్-2లో పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షల షెడ్యూల్ను https://schooledu.telangana.gov. in వెబ్సైట్లో పొందుపరిచినట్టు నర్సింహారెడ్డి తెలిపారు. 2,75,773 ద రఖాస్తులు రాగా.. పేపర్-1కు 94,3 35, పేపర్-2కు 1,81,438 చొప్పున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.