హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): ‘వీక్షణం’ సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో జరుగుతు న్న ప్రచారాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్‌పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ చర్య లు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద, పరిశోధనల మీద దాడి అని అభివర్ణించారు. ఆ పుస్తకాలలో చెప్పిన విషయాలపై అభ్యంతరాలున్నవారు వాటిని ఖండిస్తూ మరో పుస్తకం రాయవచ్చని సూచించారు. అంతే తప్ప ఒక మతానికి చెందినవారిని రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటిని ఖండించాలని ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు ఆయన విజ్ఞప్తి చేశారు.