బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 18:00:04

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కరోనా పరీక్షలు

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కరోనా పరీక్షలు

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నేడు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కోవిడ్‌ నెగెటివ్‌గా తేలింది. దీనిపై ట్విట్టర్‌ ద్వారా గవవర్నర్‌ స్పందిస్తూ... తాను ఈ రోజు కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. రెడ్‌ జోన్‌లో ఉన్న వ్యక్తులు వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారు దయచేసి ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ముందస్తు రోగ నిర్దారణ పరీక్షలు మనల్ని రక్షించడమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాయన్నారు. సంకోచించొద్దు మీరు పరీక్షలు చేయించుకోండి ఇతరులు చేయించుకునేలా చూడండని అన్నారు. నాలుగు టీ(టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌, టీచ్‌) లను పాటించాల్సిందిగా ఆమె పేర్కొన్నారు. 


logo