హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): క్వాంటమ్ టెక్నాలజీతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకొన్నది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్వాంటల్ టెక్నాలజీ విషయాల్లో నాలెడ్జ్‌ను షేర్ చేసుకొనేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా, క్వాంటమ్ ఎకోసిస్టం టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ స్టార్టప్‌లు సరికొత్త ఆవిష్కరణలు చేపట్టేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనే అవకాశం కల్పించామని వివరించారు. క్వాంటమ్ టెక్నాలజీలో అత్యంత అనుకూల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయటమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని శ్రీనివాసరావు వివరించారు.