హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా మారిన టీ హబ్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు టీ-ఏంజిల్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ‘టీ హబ్’ ప్రతినిధులు తెలిపారు. ‘టీ-ఏంజిల్ కోహర్ట్-6’ పేరు తో ఆరో విడత కార్యక్రమం మే 10 వరకు కొనసాగుతుందని చెప్పారు. దీనికి అర్హులైన స్టార్టప్ వ్యవస్థాపకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంపికైన స్టార్టప్‌లకు 3 నెలల పాటు టీ హబ్‌లోని వివిధ రంగాల నిపుణులు మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తారని వెల్లడించారు. మొదటిసారి పెట్టుబడి కోసం చూస్తున్న వారైతే స్టార్టప్‌లను ఏవిధంగా ప్రారంభించి, వ్యాపార నమూనాలు సిద్ధం చేసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు.