Super El Nino | పసిఫిక్‌లో సుడులు తిరుగుతున్న సూపర్ ఎల్‌నినో.. అత్యంత వేడి సంవత్సరంగా 2027!
Super El Nino | ఎల్‌నినో పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనట్టు ‘అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్' (ఏఎన్వోఏఏ) ప్రకటించింది. ఇది త్వరలో (జూలై-సెప్టెంబర్ మధ్య) అత్యంత తీవ్రస్థాయికి చేరుకొనే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Super El Nino | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఎల్‌నినో పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనట్టు ‘అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఏఎన్వోఏఏ) ప్రకటించింది. ఇది త్వరలో (జూలై-సెప్టెంబర్ మధ్య) అత్యంత తీవ్రస్థాయికి చేరుకొనే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈసారి వస్తున్న ఎల్‌నినో ఈ శతాబ్దంలోనే అత్యంత బలమైనదిగా ఉంటుందని, దీనిని ‘సూపర్ ఎల్‌నినో’అని పిలుస్తున్నామని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ దీనిని ‘అత్యవసర వాతావరణ హెచ్చరిక’గా అభివర్ణించారు. ఎల్‌నినో అనేది భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెకడం వల్ల జరిగే పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని, ఉష్ణోగ్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 2026-27 శీతాకాలంలో దీని ప్రభావం ఉత్తరార్ధగోళంపై ఎకువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఈ వాతావరణ మార్పుల వల్ల 2027 ప్రపంచంలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.ఎల్‌నినో ప్రభావం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుందని, ఇది అట్లాంటిక్ ప్రాంతంలో హరికేన్ల తీవ్రతను తగ్గిస్తుండగా, పసిఫిక్ ప్రాంతంలో ముప్పును పెంచే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అమెరికాలో శీతాకాలంపై దీని ప్రభావం ఎకువగా ఉంటుందని, దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నదని, ఆఫ్రికాలో కరువు, వరదల మిశ్రమ ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం.. ఆహార కొరత
ఎల్‌నినో కారణంగా తలెత్తే వాతావరణ మార్పులు ప్రపంచ ఆహార సరఫరాను దెబ్బతీసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా మకజొన్న, వరి వంటి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇది భారత్, ఇండోనేషియా, బ్రెజిల్‌పై ఎకువగా ప్రభావం చూపుతుందని అంచనా. భారత్‌లో ఎల్‌నినో కారణంగా వేడిగాలులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. గతంలో 2015-16 నాటి ‘సూపర్ ఎల్‌నినో’ సమయంలో దేశంలో సగటు వర్షపాతంలో 86% మాత్రమే నమోదైంది. కేవలం ఎల్‌నినో మాత్రమే కాకుండా, ఇతర వాతావరణ కారకాలు కూడా దేశీయ రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

