స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో సారస్వత పరిషత్
తెలంగాణ ఉద్యమంలో మన అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడానికి సురవరం రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఎత్తిపట్టాం. సారస్వత పరిషత్ అందించిన గ్రంథాలెన్నో ఉద్యమానికి ఉత్ప్రేరకంలా పనిచేశాయి. భాషాభిమానం పెంచే సారస్వత పరిషత్ పుట్టుక కూడా భాషాభిమానం నుంచి పుట్టుకొచ్చినదే.
తెలంగాణ ఉద్యమంలో మన అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడానికి సురవరం రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఎత్తిపట్టాం. సారస్వత పరిషత్ అందించిన గ్రంథాలెన్నో ఉద్యమానికి ఉత్ప్రేరకంలా పనిచేశాయి. భాషాభిమానం పెంచే సారస్వత పరిషత్ పుట్టుక కూడా భాషాభిమానం నుంచి పుట్టుకొచ్చినదే. తెలుగుకు ఆదరణే లేని కాలంలో.. తెలుగులో మాట్లాడితే గౌరవం దక్కని రోజుల్లో… తెలుగుని వెలిగించేందుకు నడుంకట్టిన సారస్వత పరిషత్ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపుకొని తెలుగు భాషా కీర్తిని నేటికీ చాటుతున్నది. పదో ఆంధ్ర మహాసభలు హైదరాబాద్ (రెడ్డి హాస్టల్)లో జరిగాయి. ఈ సభద్వారా భాషాభివద్ధికి పాటుపడే అవకాశాలు లేవని భావించి, ఆ మహాసభలోనే వేరొక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు భాస్కరభట్ల కష్ణారావు, బూర్గుల రామకష్ణారావు, లోకనంది శంకరనారాయణ రావు, బుక్కపట్నం రామానుజాచారి, కాళోజీ నారాయణరావు.
మొత్తం 19 మంది సభ్యులు కలిసి తెలుగు వాళ్లలో మాతృభాషాభిమానం పెంచడం, భాషా వ్యాప్తికి పాటుపడడం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రకారం 1943 మే 26న ‘నిజాం రాష్ర్ట ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం ‘ఆంధ్ర సారస్వత పరిషత్’గా మార్చారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావంతో ‘తెలంగాణ సారస్వత పరిషత్’గా నేటికీ భాషాభిమానం పెంచుతూ, తెలుగు సాహితీ వైభవాన్ని చాటుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

