హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రోత్సహించేందుకు అందజేసే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 36,262 స్కూళ్లు దరఖాస్తు చేసుకొన్నాయి. 5 రకాలైన స్టార్ రేటింగ్ కోసం సర్కారీ స్కూళ్లతోపాటు ఎయిడెడ్, ప్రైవేట్ బడులు పోటీపడుతున్నాయి.
ఈ నెలలోనే జిల్లా స్థాయి ఎంపికను పూర్తిచేయనుండగా, జూన్ 30న రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేస్తారు. రాష్ట్రంలో మొత్తం 42,920 బడులుండగా, స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి 38,922 స్కూళ్లు రిజిస్ట్రేషన్ చేసుకొన్నాయి. 22 లోపు రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపాలి. జూలై 1 నుంచి 7 వరకు జాతీయస్థాయికి ప్రతిపాదనలు పంపితే అక్టోబర్ 15 (గ్లోబల్ హ్యాండ్ వాష్ డే)న జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేస్తారు.