హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏక్ పోలీస్ నినాదంతో నిరసనలు తెలుపుతున్న బెటాలియన్ పోలీసులపై టీజీఎస్పీ కొరఢా ఝుళిపించింది. నిబంధనలు అతిక్రమించారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు అర్ధరాత్రి టీజీఎస్పీ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీసు క్రమశిక్షణకు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టడంతో పాటు ఇతరుల్ని ధర్నాలకు ఉసిగొల్పారనే ఆరోపణలతో 39 మందిని గుర్తించింది. పోలీసు ప్రవర్తనా నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే వీరిపై చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్లపైకి రావడం సరికాదని తెలిపింది.
బాపూఘాట్’ అభివృద్ధికి భూసేకరణ!
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చుట్టూ భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎంత మేర భూమి అవసరమో అంచనా వేసి చెప్పాలని మెయిన్‌హార్ట్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు సమా చారం. ఈ నెల 24వ తేదీన మెయి న్హార్ట్ కంపెనీ ప్రతినిధులతో తన నివా సంలో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేవలం అధికారులు మాత్ర మే హాజరుకాగా, మంత్రులు, ప్రజాప్రతిని ధులెవరినీ ఆహ్వానించలేదని సమాచారం. ఈ చర్చల్లో ప్రధానంగా మూసీ బఫర్ జోన్, బాపూఘాట్పై చర్చ జరిగినట్టు తెలిసింది. మూసీ బఫర్ జోన్లో రోడ్లతోపాటు మెట్రో వంటి రవాణావ్యవస్థలతో అనుసంధానం చేసేలా డిజైన్లు రూపొందించాలని ఆదేశించినట్టు తెలిసింది. బాపూఘాట్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్టు సమాచారం. ఎంత మేర కేంద్రప్రభుత్వ భూములు కావాలో చెప్తే, ఆ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని కన్సల్టెన్సీ ప్రతినిధికి చెప్పారట. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ను కలపాలని కాలువల ద్వారానా? లేదా టన్నెల్ ద్వారానా? అనేది కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం.