హాజీపూర్: రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న మండల సర్వేయర్ (Surveyor) , చైన్‌మెన్‌ను ( Chainman ) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన మంచిర్యాల తహసీల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మండల సర్వేయర్ మంజుల , చైన్ మెన్ ఉదయ భూ సర్వే కోసం బాధితుడికి రూ. 50 వేలు డిమాండ్ చేసి రూ. 30వేలకు ఒప్పందం చేసుకున్నారని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. ఇందులో రూ. 16,500లను ఫోన్ పే, మరో రూ. 10వేలను నగదుగా తీసుకున్నారు.
మరో రూ. 30 వేలు ఇస్తేనే భూమి సర్వే చేస్తామని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడని వివరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని, గురువారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వెల్లడించారు.