హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకనందగౌడ్ల తరఫు న్యాయవాదులు తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కార్యాలయంలో అందజేశారు.
న్యాయవాదులు కల్యాణ్‌రావు, అంబాల హరీశ్ శనివారం స్వయంగా శాసనసభకు వచ్చి స్పీకర్‌కు అందించేందుకు ప్రయత్నించారు. స్పీకర్ సభలో ఉండటంతో ఆయన కార్యాలయంలో సుప్రీంకోర్టు నోటీసుల కాపీలను అందజేశారు. ఈ నెల 25న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించిన విచారణ జరగనున్న విషయం తెల్సిందే.