Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court | పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
Supreme Court | న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇప్పటి వరకు కోర్టు నుంచి తమకు నోటీసులు రాలేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రతివాదుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. 22వ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి మాట్లాడుతూ.. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే దాకా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి..? ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను డివిజన్ బెంచ్ రివర్స్ చేసింది. ఇప్పటికి ఏడాది పూర్తయింది. కావాలని ఆలస్యం చేస్తున్నారు అని సుందరం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

