యాదాద్రి భువనగిరి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komati reddy)కి అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నాడని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి(Sunitha Mahender Reddy ) ఘాటుగా విమర్శించారు. జిల్లాలోని గూడూరు(Guduru) గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారం భోత్సవంలో మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ గుండాలు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై దాడులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో కోమటిరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కనాడు భువ నగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడ లేదని ఆరోపించారు. ఈ రోజు మంత్రిగా పని చేస్తూ మంత్రి సమాన హోదా కలిగిన వ్యక్తిని అవమానం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. సందీప్రెడ్డిపై జరిగిన దాడిపై ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్నారు.