నస్పూర్, నవంబర్ 1: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయించిన కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లోలం అని మండిపడ్డారు.
ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, హింసా రాజీకీయాలు చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించినట్టు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.