హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా(సీఈవో)గా సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత సీఈవో వికాస్‌రాజ్ నుంచి సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డికి వికాస్‌రాజ్‌తోపాటు ఎన్నికల సంఘం అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.