హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వెదురు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే..? దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఉద్యానశాఖ ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టునే చేపట్టింది. నిర్మల్ జిల్లా భైంసాలో 15 ఎకరాల్లో 2019 నుంచే విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన భీమా బ్యాంబూ రకం వెదురు చెట్లను పెంచుతున్నది. ఏపుగా పెరిగిన వెదురు కర్రల నుంచి ప్రత్యేక యంత్రాల ద్వారా ఇప్పటికే వెదురు పెల్లెట్స్ను విజయవంతంగా తయారుచేసింది. త్వరలోనే జాతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో బొగ్గుకు బదులుగా ఈ పెల్లెట్స్ను వినియోగించి, పరీక్షించనున్నారు. ఇప్పటికే చైనా, జర్మనీ, అమెరికా వంటి అనేక దేశాల్లో వెదురు పెల్లెట్స్తో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో కూడా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిలో వెదురు పెల్లెట్స్ను 7% తప్పనిసరిగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన తెలంగాణలో ఉత్పత్తి చేస్తున్న థర్మల్ విద్యుత్తుకు ఏటా 67 లక్షల టన్నుల పెల్లెట్స్ అవసరమని అధికారుల అంచనా. ఇంత భారీ మొత్తంలో డిమాండ్ ఉండటంతో దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగును ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.వెదురు ఉత్పత్తికి ఎకరాకు అయ్యే ఖర్చు రూ.50 వేలు