ఖమ్మం, అక్టోబర్ 20: దేశంలోనే తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకొనేలా మొబైల్ మాక్ ఈ-ఓటింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు తెలిపారు. మాక్ ఓటింగ్‌కు పేర్లు నమోదు చేసుకున్న 3,830 మందిలో 2,128 మంది (55.6 శాతం) మంది ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఓటు వేశారని వివరించారు. ఈ ప్రక్రియపై ఓటర్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని, 90% మంది ‘గుడ్’ అని, 70% మంది ‘ఎక్సలెంట్’ అని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని స్పష్టం చేశారు.