హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ జాతీయ అధ్యక్షుడిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎంపికయ్యారు. గోవాలో నిర్వహించిన ఐఏఎస్వో జా తీయ సదస్సులో ఆయన బాధ్యతలు చేపట్టారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయనను శుక్రవారం డాక్టర్లు, సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యుడు జేయస్ఆర్ ప్రసాద్, డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ టీఎస్రావు, డాక్టర్ కల్పనా రఘునాథ్, డాక్టర్ ఫణి కోటేశ్వరరావు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ అంగప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసే భక్తులకు ఇచ్చే టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజుకు 750 చొప్పున ఆన్లైన్ డిప్ వి ధానంలో జారీ చేస్తుండగా.. ఈ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇకపై మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో టోకెన్లు విడుదలవుతాయని టీటీడీ తెలిపింది.