హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారానికి మహిళా సంక్షేమం, గిరిజనాభివృద్ధిశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ శనివారం బీఆర్కేభవన్లో మూడోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో సబ్‌కమిటీ సభ్యులైన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డితోపాటు సీఎస్ సోమేశ్‌కుమార్ అటవీ, రెవెన్యూ, గిరిజనాభివృద్ధిశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.