టెక్నాస్, నవంబర్ 26: కడుపులోని మంచి బ్యాక్టీరియాకు మలబద్ధకానికి ఉన్న సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ‘ప్రోబయాటిక్ బిఫైడో బ్యాక్టీరియం జన్యువులు పేగు చలనశీలతను ప్రభావితం చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది’ అని ‘సెల్ హోస్ట్, మైక్రోబీ’ జర్నల్ వార్తా కథనం పేర్కొన్నది.
‘వివిధ రకాల ప్రొబయాటిక్-ముఖ్య అవయవాలకు మధ్య సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశాం. ఎలుకలు, మానవులపై ప్రయోగాల్లోనూ ఒకేరకమైన ఫలితాలు వచ్చాయి’ అని జియాగ్నం వర్సిటీ ప్రొఫెసర్ కిగ్జాయో జాయి చెప్పారు.