అనుమానాస్పద స్థితిలో హాస్టల్లో విద్యార్థి మృతి
హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
- సమాచారం ఇవ్వలేదని బంధువుల ఆగ్రహం
- వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
మామిళ్లగూడెం, అక్టోబర్ 30 : హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామానికి చెందిన అచల అజయ్‌కుమార్ (17) ఖమ్మం నగరంలోని శాంతినగర్ ప్రాంతంలో ఉన్న ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఎల్టీ కోర్సు అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. తోటి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపిన అజయ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లాడు.
ఎంతకూ రాకపోవడంతో 6 గంటల సమయంలో తోటి విద్యార్థులు బాత్రూమ్ తలుపును బలవంతంగా తెరిచి చూశారు. అప్పటికే మూత్ర విసర్జన చేసుకుని అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. వెంటనే కాళ్లు, చేతులకు మర్దన చేసి 108 వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. అజయ్ తండ్రి లక్ష్మీనారాయణ గతంలోనే మరణించగా, తల్లి ఉపేంద్ర వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుమారుడిని చదివిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

