హయత్‌నగర్, ఆగస్టు 26: హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు ఎండలో మోకాళ్లపై నిలబెట్టడంతో మనోవేదనకు గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న ఘటన హైద రాబాద్లోని హయత్‌నగర్‌లో జరిగింది. స్థానిక బంజారాకాలనీకి చెందిన లక్పతి, సరిత దంపతులకు కూతురు అక్షయ శశ్వ త్(13), కొడుకు సిద్ధార్థ్ ఉన్నారు. అక్షయ రాఘవేంద్ర కాలనీలోని శాంతినికేతన్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నది. అక్షయ గురువారం హోంవర్క్ చేయకుండా స్కూల్‌కు వెళ్లటంతో కోపోద్రిక్తుడైన టీచర్ వంశీ రెండు గంటలపాటు ఎండలో మోకాళ్లపై నిల్చోబెట్టాడు. దీంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. స్కూల్ ము గిశాక ఇంటికి వచ్చిం ది. తల్లిదండ్రులు లేక పోవటం, తమ్ముడు ట్యూషన్‌కు వెళ్లటంతో.. ఒంటరిగా ఉన్న ఆమె బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకొన్నది. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. అక్షయ మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.