హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. ఈ సమ్మెను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. సోమవారం చర్చల పేరు తో హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ.. మంగళవారం కనీసం పట్టించుకోలేదు. సోమవారం చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా జూడాల ప్రతినిధులను మినిస్టర్స్ క్వార్టర్స్‌కు పిలిచి చర్చించారు. కొన్నింటికి మాత్రమే హామీ ఇచ్చి, మరికొన్నింటిని పట్టించుకోలేదు. డీఎంఈతో చర్చలు జరపాలం టూ పంపేశారు. డీఎంఈ దగ్గర కూడా తేలకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశా యి.
వీటికి కొనసాగింపుగా మంగళవారం చర్చలు జరుగుతాయని అందరూ భావించి నా, వైద్యారోగ్య శాఖ నుంచి స్పందన కనిపించలేదు. మంత్రి, ఉన్నతాధికారుల నుంచి పి లుపు అందలేదు. జూడాలు గొంతెమ్మ కోరి కలు కోరుతున్నారంటూ కొందరు అధికారులు ఉన్నతాధికారులతో చెప్పినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓపీ, ఐపీ సేవలకు ఇబ్బందులు ఎ దురవుతున్నా.. జూడాల సమ్మెను లైట్ తీసుకుంటున్నదని విశ్లేషకులు మండిపడుతున్నా రు. అవసరమైతే అత్యవసర సేవలనూ బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు.