హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): శ్రీలంక-తెలంగాణ మధ్య బౌద్ధ, సాంసృతిక, పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం శ్రీలంక కళాకారుల బృందం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసింది. ఈ సందర్భంగా వారిని మంత్రి సన్మానించారు. బౌద్ధం, సంసృతి, కళలు, వారసత్వం వంటి అంశాలు శ్రీలంక-తెలంగాణ మధ్య సుదీర్ఘ అనుబంధానికి ప్రతీకలని జూపల్లి పేరొన్నారు.