పెద్ద కొడప్గల్, అక్టోబర్ 2: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన విఠల్రావు కూతురు వాణిశ్రీ బుధవారం ఆరుబయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారి ముఖం, తలపై గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. కుక్కల బెడద తప్పించా లని స్థానికులు కోరుతున్నారు.