బల్మూరు, జనవరి 12 : ఉమమాహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆపాలని గ్రామసభలో తీర్మానం చేసినట్టు నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ సీతారాంరెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన బల్మూరులో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. రైతుల అనుమతులు లేకుండా ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం సరికాదని అన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని బల్మూర్తోపాటు అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాల రైతులు కోర్టుల్లో కేసులు వేసినట్టు చెప్పారు. కోర్టుల నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు రాలేదని, అయినా కాంట్రాక్టు కంపెనీ వారు వినకుండా పనులు చేపడుతున్నారని మండిపడ్డారు.