కాంగ్రెస్‌లోకి వస్తే అడ్డుకుంటాం
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్‌లోకి వస్తే అడ్డుకుంటామని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జులు హెచ్చరించారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.
- స్టేషన్‌ఘన్‌పూర్ బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జుల హెచ్చరిక
స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్‌లోకి వస్తే అడ్డుకుంటామని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జులు హెచ్చరించారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడుసార్లు ఓడిపోయిన రాజయ్యపై జాలిపడి వైఎస్సార్ మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే 2009లో పార్టీకి, కార్యకర్తలకు నమ్మకద్రోహం తలపెట్టి బీఆర్ఎస్లో చేరారని దుయ్యబట్టారు.
ఆ పార్టీలో వివిధ పదవులు చేపట్టి, ఆయా శాఖల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్లో చెల్లకుండా పోయిన రాజయ్య కాంగ్రెస్‌లో ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో చేసిన అవినీతికి ప్రజలు ఎదురు తిరుగుతారనే భయంతోనే అధికార పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకుని పార్టీని విచ్ఛిన్నం చేయవద్దని, మహిళల గౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజయ్యను పార్టీలోకి తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

