హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కేవలం 45 రోజుల వ్యవధిలో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసినట్టు యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అరుదైన ఘనత సాధించిన సోమాజీగూడ యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లిని, అతని వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.
రోబోటిక్ సర్జరీలతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా మరింత సులభంగా కచ్చితత్వంతో నిర్వహించవచ్చని పేర్కొన్నారు. రోగులకు అధునాతన చికిత్సను అందించేందుకు యశోద హాస్పిటల్స్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు.