హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ ఈ నెల 18న భేటీ కానున్నది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయా లని సీఎస్ రామకృష్ణారావు ఆయా శాఖలకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో ముఖ్యంగా తమ్మిడిహట్టి ప్రాజెక్టు, ఎల్నినో ప్రభావం, రైతుభరోసా, జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు మరిన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసిం ది. అయితే తొలిసారిగా ఈ-క్యాబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇందులో భాగంగానే మంత్రులు, అధికారులకు ప్రత్యేకమైన ట్యాబ్లు అం దజేయనున్నారు.