హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న జరుగనున్నది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ కానున్నది. ఈ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతోపాటు రోహిత్ వేముల చట్టం, ఆదాయాలు సమకూర్చడం, భూ రిజిస్ట్రేషన్ల పెంపు వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.