మహిళలపై వివక్షను ప్రశ్నించండి : డీజీ చారుసిన్హా
మహిళలపై వేధింపులు, వివక్షను ప్రశ్నించడంలో పురుషులు ముందుండాలని పోలీస్ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ చారుసిన్హా సూచించారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా తప్పులో భాగస్వాములైనట్టేనని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : మహిళలపై వేధింపులు, వివక్షను ప్రశ్నించడంలో పురుషులు ముందుండాలని పోలీస్ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ చారుసిన్హా సూచించారు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా తప్పులో భాగస్వాములైనట్టేనని చెప్పారు. మహిళల భద్రతను ప్రతి ఒకరి బాధ్యతగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ‘#స్టాండ్విత్హర్’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సోమవారం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరుగుతున్న దూషణలు, వేధింపులను సాధారణంగా తీసుకోకూడదన్నారు. యూనివర్సిటీ సూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కే సునీతారాణి మాట్లాడుతూ లింగ సమానత్వం విద్యాసంస్థలు, కార్యాలయాలకే పరిమితం కాకుండా ఇండ్లల్లోనూ అమలుకావాలని తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి అనురాధ, రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అధిపతి ప్రొఫెసర్ దీపా శ్రీనివాస్, ట్రైనర్ ఆసియా షర్వాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

