గణపురం, మే 30 : కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లోని 500 మెగావాట్ల ప్లాంట్‌లో గురువారం విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తి బాయిలర్ ట్యూబులు లీకేజీ కావడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలిసింది. సమస్యను పరిష్కరించేందుకు జెనో ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.