హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం డ్యామ్ నుంచి ఎప్పుడంటే అప్పుడు జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడం కుదరదని, దిగువన నాగార్జునసాగర్‌లో తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇన్సిడెంటల్‌గా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు పూర్తిగా తమకే దక్కుతాయని పేర్కొన్నది. కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ట్రిబ్యునల్ ఎదుట ఏపీ సర్కార్ శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ప్రధానంగా శ్రీశైలం ఎండీడీఎల్‌ను 854 అడుగులుగా నిర్ధారించాలని కోరింది.
చేర్యాల, అక్టోబర్ 18 : సిద్దిపేట జిల్లా చేర్యాలలో బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(కళాశాల) భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. 7వ తరగతి విద్యార్థిని శుక్రవారం రాత్రి మొదటి అంతస్థు ఎక్కి భవనం వెనుక భాగం నుంచి కిందికి దూకింది. గాయాలపాలైన ఆమెను వెంటనే చేర్యాల ప్రభుత్వ ద వాఖానకు తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతో సిద్దిపేట దవాఖానలో చికి త్స చేయిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ను నమస్తే తెలంగాణ ఫోన్లో ప్రశ్నించగా.. తాను సెలవులో ఉన్నానని, ఘటనపై టీచర్లు తనకు ఫోన్ చేసి చెప్పారని, విద్యార్థి ఆరోగ్యం బాగానే ఉందని సమాధానం ఇచ్చారు.