హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా పోలీసుశాఖలో బదిలీలపై దృష్టిసారించింది. తాజాగా హైదరాబాద్ కమిషనర్‌గా అడిషనల్ డీజీ (ఆర్గనైజేషన్ అండ్ లీగల్) కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(1994 బ్యాచ్)ని నియమించింది.
- సైబరాబాద్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి
- రాచకొండకు సుధీర్‌బాబు
- టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
- నేడో రేపో మరికొందరి బదిలీ
- సీఎం కార్యదర్శిగా షానవాజ్
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా పోలీసుశాఖలో బదిలీలపై దృష్టిసారించింది. తాజాగా హైదరాబాద్ కమిషనర్‌గా అడిషనల్ డీజీ (ఆర్గనైజేషన్ అండ్ లీగల్) కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(1994 బ్యాచ్)ని నియమించింది. సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి (2005 బ్యాచ్), రాచకొండ సీపీగా సుధీర్‌బాబు (2001 బ్యాచ్)ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడీజీ సందీప్ శాండిల్య (1993 బ్యాచ్) ను ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో’ డైరెక్టర్‌గా నియమించింది.
ఇప్పటివరకు రాచకొండ కమిషనర్‌గా ఉన్న డీఎస్ చౌహాన్ (1997 బ్యాచ్), సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర(1999 బ్యాచ్)ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను కూడా నేడో, రేపో కీలక పోస్టుల్లోకి బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మల్టీజోన్-2 ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న షానవాజ్ ఖాసీంను ముఖ్యమంత్రి సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆయన సీఎం పేషీకి వెళ్లి రిపోర్ట్ చేశారు. అనంతరం డీజీపీ రవి గుప్తాను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. మల్టీజోన్-2 ఐజీ పోస్టులో ఐజీ తరుణ్జోషీని నియమిస్తారని పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

